top of page

Daily News for People

Meet our Editorial Team

ఎడిటర్, షేక్ హుస్సేన్

Senior Editor

అసమానతలు లేని సమాజం లక్ష్యం గా ముందుకు సాగుదాం. కొందరి స్వార్థం కోసం ఏర్పడ్డ మతాలు, కులాలు ఈ దేశ అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నాయి. చదువుకున్న యువకులు ఉపాధి అవకాశాలు లేక దినసరి కూలీలుగా మారుతున్న దీనస్థితి సమాజ పురోభివృద్ధికి మాయని మచ్చగా మిగులుతున్నది. సమాజంలో ఎక్కడ చూసినా దోపిడీలు,హత్యలు అత్యాచారాలు. ఇది మన దేశ అభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది.పాలకుల ఆలోచన విధానం మారనంతకాలం సమాజ అభివృద్ధి కుంటుపడుతూనే ఉంటుంది.సమాజ అభివృద్ధికి చైతన్య దీపికలుగా ఉన్న పత్రిక రంగాన్ని మరింత బలోపేతం చేయటం ద్వారా సమాజంలో అన్ని వర్గాల ప్రజలను చైతన్యం చేయడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడం సాధ్యపడుతుంది అని నా ఆలోచన.ఆలోచన ఆచరణాత్మకం కావడంతోనే ఫలితాలు ఉంటాయన్న భావనతో స్వతంత్ర సంగ్రామం పేరుతో దినపత్రికను తీసుకురావడం జరిగింది. అభ్యుదయ భావజాలం పునికి పుచ్చుకున్న నేను సమ సమాజం దిశగా ప్రజలను మార్చేందుకు, ప్రజల్లో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంగా పత్రికను ముందుకు నడిపిస్తున్నాను. సమాజంలో నాలుగవ స్తంభంగా ఉన్న పత్రిక రంగం బలంగా ఉన్నప్పుడు మాత్రమే పాలకులు జాగ్రత్తగా పరిపాలన చేయగలుగుతారు. ఎన్నో మహోన్నత లక్ష్యాలను చేరుకోవాలన్న మహోన్నత ఆశయంతో స్వతంత్ర సంగ్రామం దినపత్రిక ప్రారంభించాను. చిన్న వయసునుండే ప్రశ్నించడం అలవర్చుకున్న నేను సామాజిక కార్యకర్తగా, జర్నలిస్టుగా సమాజంలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్నాను. తాను ఒక్కడినే బలమైన పాత్ర నిర్వహించటం సాధ్యం కాదని,  పత్రిక ద్వారా అది సాధ్యపడుతుందని నమ్మి ముందుకు నడుస్తున్నాను.నా ఈ ప్రయాణంలో సమాజ అభ్యున్నతిని కోరే ప్రతి వ్యక్తి నాకు అండగా నిలిచి నా పత్రిక *స్వతంత్ర సంగ్రామం*ను ముందుకు నడిపించాలని మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను.
-షేక్ హుస్సేన్, ఎడిటర్ స్వతంత్ర సంగ్రా

స్వతంత్ర సంగ్రామం దినపత్రిక లక్ష్యం...

సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక తదితర రంగాలకు సంబంధించిన సమాచారం అందించడం.

              విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి పలు రంగాలకు సంబంధించిన సమాచారం సేకరించి అందుబాటులో ఉంచడం.
బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలకు అండగా నిలవటం...ప్రజలపక్షాన పోరాటాలు చేసే వారికి వెన్నుదన్నుగా నిలవటం... ప్రజలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు అండగా ఉండటం..వినోదాత్మక కార్యక్రమాలు అందించటం..      ప్రజలలో సామాజిక చైతన్యం కలిగించడం.. దోపిడి దారుల అకృత్యాలను ప్రశ్నించడం.

bottom of page